29 న అక్షర లక్ష గాయత్రి జపయజ్ఞం !

👉  హైదరాబాద్ ఎల్ బీ నగర్ లో సువర్ణ భారతీ గోశాలలో !

👉 గాయత్రి పాడ్యమి సందర్భంగా ..!


J SURENDER KUMAR,


ఈ నెల 29 న గాయత్రి పాడ్యమి, శనివారం
శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్య భక్త సమాజం & తత్వం చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యవంలో హైదరాబాద్ లో సువర్ణ భారతీ గోశాల, బైరామల్గూడ, ఎల్.బి. నగర్ X రోడ్, లొ సామూహిక సహస్ర గాయత్రి జపం, గాయత్రి హోమం, గాయత్రి క్షీర తర్పణం మరియు సహస్ర బ్రాహ్మణ సంతర్పణం అంగరంగ వైభవంగా జరగనున్నది.

పశర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ  ఆధ్వర్యంలో మహావాది వినోద్ కుమార్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఉదయం 8-00 గం॥ల నుండి 12-00 గం॥ల వరకు పూజాది కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

1008 కంటే తక్కువ కాకుండా గాయత్రి జపం చేసి హోమం తర్పణం లలో పాల్గొని సహస్ర బ్రాహ్మణ సంతర్పణం విజయవంతం చేయాలని సమస్త గాయత్రి ఉపాసకులకు
తెలంగాణ రాష్ట్ర గాయత్రి ఉపాసన సంస్థ అధ్యక్షులు
వినోద్ కుమార్ మహావాది విజ్ఞప్తి చేశారు.


ఈ మహా యజ్ఞం లో శ్రీ అదిశంకర భక్త సమాజం, బ్రాహ్మణ వైధిక పరిషత్, బ్రాహ్మణ సంక్షేమ వేదిక మొదలగు అన్ని సనాతన ధర్మ పరి రక్షణ సంఘాలు భాగస్వామ్యం కానున్నట్టు వినోద్ కుమార్ తెలిపారు.

👉 వివరాలకు :-  వినోద్ కుమార్ మహావాది. B. E.
అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర గాయత్రి ఉపాసన సంస్థ.
9000013755. సంప్రదించాలని కోరారు.