మంథని మాజీ ఎమ్మెల్యే ను విచారించిన సిబిఐ ?

👉 న్యాయవాద దంపతుల హత్య కేసులో ..


J.SURENDER KUMAR,


మంథని ప్రాంతానికి చెందిన, న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, పివి నాగమణి జంట హత్యలపై సిబిఐ అధికారులు గురువారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ను పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో విచారించినట్టు సమాచారం.


వామన్ రావు నాగమణిలను 2021,ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద దారుణంగా హత్య జరిగింది. వామన్ రావు తండ్రి, గట్టు కిషన్ రావు ,తన కొడుకు కోడలు హత్య సంఘటనలో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం కీలక సూత్రధారులను వదిలి పెట్టారని, నిష్పక్షికంగా దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టు లో 751 పేజీల పిటిషన్ దాఖలు చేశారు.

ఆగస్టు 2025లో, భారత అత్యున్నత న్యాయస్థానం ( సుప్రీంకోర్టు )హత్యల దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి బదిలీ చేసింది,

👉 గత సంవత్సరం సిబిఐ అధికారుల బృందం మంథని కి

దాదాపు నెల రోజులకు పైగా సెల్ ఫోన్ ల కాల్ డేటా, ఆయా ప్రాంతాలలో సెంటవర్ ల నుంచి   అవుట్ గోయింగ్ , ఇన్ కమింగ్, అనుమానిత ఫోన్ డాటా, వివరాలు, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో  పోలీస్ అధికారుల బదిలీలు, నిబంధనల మేరకు జరిగాయా ?  రాజకీయ పోద్బలంతో జరిగాయా ? అనే అంశాలు పరిశీలించారు.

న్యాయవాద దంపతుల స్వగ్రామం గుంజపడుగు కు వెళ్లి వామన్ రావు, తండ్రి కిషన్ రావు తో మాట్లాడారు. వామన్ రావు ఇంటిని, గ్రామంలో నిర్మితమైన ఆలయ పరిసరాలను, ఆలయాన్ని పరిశీలించారు.  న్యాయవాది వామన్ రావు తండ్రి కిషన్ రావు తో పాటు, అధికారుల బృందం హత్య జరిగిన కల్వచర్ల రోడ్డును, పరిసరాలను పరిశీలించారు. గత సంవత్సరం దాదాపు 100 మందికి పైగా వ్యక్తులను సిబిఐ అధికారులు విచారించారు