J.SURENDER KUMAR,
రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ను ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్, వేముల నాగలక్ష్మి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చిలుముల లక్ష్మణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, నరసింహులు, కో ఆప్షన్ సభ్యులు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు.

జగిత్యాల కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి అజారుద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ మంత్రి స్వాగతించారు. ప్రభుత్వ పక్షాన గౌరవ వందనం స్వీకరించారు. ఉద్యోగులకు ప్రశంస పత్రాలతో పాటు, జిల్లా, రాష్ట్ర ప్రగతి నివేదికను ప్రసంగించి స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు.
