👉 కరీంనగర్ జిల్లాలో 3 లక్షల 22వేల 198 రేషన్ కార్డులు !
👉 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల భాగంగా కరీంనగర్ కలెక్టర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పాల్గొని అర్హులైన వారికి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ……..

గత ప్రభుత్వ కాలం లో ఏనాడు పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్రం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి రేషన్ కార్డు పంపిణీ చేయడంతో పాటు రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.
👉 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ని అందిస్తున్నామని అర్హులైన వారికి మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నెరవేర్చుతామని మంత్రి తెలిపారు.
👉 రాష్ట్రవ్యాప్తంగా కోటి 5 లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. అనేక భద్రత చర్యలు తీసుకొని స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో 3 లక్షల 22వేల 198 రేషన్ కార్డులు ఉన్నాయని మంత్రి తెలిపారు.
👉 2025 జనవరి నుండి ఇప్పటివరకు కరీంనగర్ జిల్లాలో 45,290 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. పాత రేషన్ కార్డులు 86,947 మంది సభ్యుల పేర్లను కొత్తగా చేర్చినట్లు మంత్రి వివరించారు. జిల్లాలో 566 రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

👉 ఈ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలువురు ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రతో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, రాష్ట్రం మున్నూరు కాపు సంఘం చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
