నర్సయ్యపల్లె–ధర్మపురి రోడ్డు పనులకు భూమి పూజ !

J SURENDER KUMAR,

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయిన
ధర్మపురి పట్టణ శివారు గ్రామమైన నర్సయ్యపల్లె–ధర్మపురి రోడ్డు పనులకు బుధవారం ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి, నర్సయపల్లె గ్రామ సర్పంచ్ పోతమ్ శెట్టి నర్సయ్య భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో  స్పందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్, యుద్ధ ప్రాతిపదికన నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని చైర్ పర్సన్ తెలిపారు.


భూమి పూజ కార్యక్రమంలో ఎంపీవో, ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్ , సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కాసారపు బాలగౌడ్ గారు, కాన్సిలర్లు విరవేని నాగలక్ష్మి , ఒజ్జెల లక్ష్మణ్ ,చిపిరిశెట్టి రాజేష్ , ప్రజలు పాల్గొన్నారు.

👉 నిరంతర విద్యుత్ సరఫరా పనులకు భూమి పూజ !

పట్టణంలోని 9వ వార్డు (కోరండ్లపల్లె గ్రామ)  ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా  మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో గ్రామంలో నూతన విద్యుత్ పోల్స్ మరియు విద్యుత్ లైన్  పనులకు బుధవారం చైర్ పర్సన్ నాగలక్ష్మి, వార్డు కౌన్సిలర్ వీర వేణి నాగలక్ష్మి భూమి పూజ చేశారు.

ఈ వార్డులో  విద్యుత్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప  18 నూతన ఎలక్ట్రిక్ పోల్స్‌ను సుమారు ఒక కిలోమీటర్ మేర విద్యుత్ లైన్‌తో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మంత్రి ₹.4 లక్షల 10 వేల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు , డిఈ గారు, లైన్మెన్, విద్యుత్ శాఖ సిబ్బంది, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్ , కోఅప్షన్ సభ్యులు అశెట్టి మమత ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

👉 పారిశుధ్య కార్మికులకు యూనిఫార్మ్‌ల పంపిణీ !

ధర్మపురి  పట్టణ ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం నిత్యం సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులకు బుధవారం యూనిఫార్మ్‌లను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ శ ఎం. శ్రీనివాస్ తో కలిసి  చైర్ పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి  పారిశుధ్య కార్మికులకు యూనిఫార్మ్‌లను అందించారు.



ఈ సందర్భంగా చైర్ పర్సన్  వేముల నాగలక్ష్మి  మాట్లాడుతూ… పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

వారి సంక్షేమానికి పురపాలక సంఘం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, కోఅప్షన్ సభ్యులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.