ఒక్క కాల్ – ప్రాణాలను కాపాడే 112…!


👉100 కు కాదు అత్యవసర పరిస్థితుల్లో 112కే కాల్ చేయండి!


👉 డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సివి ఆనంద్ !


J SURENDER KUMAR,


అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ప్రజలు దశాబ్దాలుగా “100”కు కాల్ చేసే అలవాటు కలిగి ఉన్నారు. అయితే కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల అత్యవసర స్పందన వ్యవస్థలో భాగంగా ఇప్పుడు 112నే సమగ్ర ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌గా వినియోగిస్తున్నారు. ప్రమాదాలు, మహిళలపై దాడులు, పోలీసు సహాయం, అత్యవసర భద్రతా పరిస్థితుల్లో ప్రజలు 112కు కాల్ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.



తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సివి ఆనంద్ బుధవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసిసిసి)లో డయల్ 112 అత్యవసర ప్రతిస్పందన సేవను బుధవారం ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ…..

డయల్ 112 సేవ ద్వారా ఒకే ఫోన్ కాల్‌తో 18 అత్యవసర సేవలను పొందవచ్చని తెలిపారు. ఈ హెల్ప్‌లైన్ నంబర్ కింద పోలీస్, అగ్నిమాపక, వైద్య అత్యవసర సేవలు వంటి కీలక సేవలు అందుబాటులో ఉంటాయి అని అన్నారు.

👉 విస్తృత ప్రచారం చేపట్టాలి !

అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ప్రజలు దశాబ్దాలుగా “100”కు కాల్ చేసే అలవాటు కలిగి ఉన్నారు. అయితే కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల అత్యవసర స్పందన వ్యవస్థలో భాగంగా ఇప్పుడు 112నే సమగ్ర ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌గా వినియోగిస్తున్నారు. ప్రమాదాలు, మహిళలపై దాడులు, పోలీసు సహాయం, అత్యవసర భద్రతా పరిస్థితుల్లో ప్రజలు 112కు కాల్ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

👉 ప్రచారం లోపిస్తే ప్రజలకు సమాచారం చేరదు
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఒక దశ అయితే, ప్రతి ఇంటికీ ఆ సమాచారం చేరడం మరో ముఖ్యమైన దశ. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా చాలామంది అత్యవసర పరిస్థితుల్లో “100”కే కాల్ చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల విలువైన సమయం వృథా అయ్యే అవకాశం ఉంది.

👉 ఏం చేయాలి..?

రాష్ట్రవ్యాప్తంగా “100 కాదు… 112” అనే సందేశంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో 112 వివరాలతో పోస్టర్లు ఏర్పాటు చేయాలి.

👉 పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించి, వారు తమ కుటుంబ సభ్యులకు తెలియజేసేలా కార్యక్రమాలు చేపట్టాలి. బస్సులు, ఆటోలు, ప్రభుత్వ వాహనాలు, LED స్క్రీన్లు, సోషల్ మీడియా, టెలివిజన్, రేడియో ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో “అత్యవసర సహాయం కోసం 112” అనే బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.

👉 112 సేవల ప్రత్యేకత !

112 అనేది సమగ్ర అత్యవసర స్పందన వ్యవస్థ. పోలీసు సహాయం అవసరమైన సందర్భాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఒకే నంబర్ ద్వారా వేగంగా స్పందించే విధంగా ఈ సేవ రూపొందించబడింది. ప్రజలు సరైన సమాచారం అందిస్తే సంబంధిత విభాగాలతో సమన్వయం చేసి త్వరితగతిన సహాయం అందించే వ్యవస్థగా ఇది పనిచేస్తుంది.

👉 112 సేవలను నిజమైన అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించాలి. సరదా కోసం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం చట్టరీత్యా నేరం. ప్రతి కాల్ వెనుక ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందనే బాధ్యతతో వ్యవహరించాలి.

👉 ప్రతి పౌరుడికి తెలియాలి !

అత్యవసర పరిస్థితుల్లో సరైన నంబర్ గుర్తుండటం ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశాన్ని పెంచుతుంది. అందుకే “100 నుంచి 112” మార్పు ప్రతి పౌరుడికి తెలిసేలా ప్రభుత్వం విస్తృత ప్రచారం చేపట్టడం కాలానుగుణ అవసరం. “112 తెలుసుకుందాం… భద్రతను బలోపేతం చేద్దాం” అనే నినాదం ప్రతి ఇంటికీ చేరితేనే ఈ వ్యవస్థ అసలైన లక్ష్యం