👉 కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి !
J.SURENDER KUMAR,
పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి , రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తో సమావేశమయ్యారు.
👉 తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

👉 ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుపై ₹ 36,437 కోట్లు, డిండి ఎత్తిపోతలపై ₹ 3,187 కోట్లు, సీతమ్మ సాగర్‌పై ₹1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై ₹.1,350 కోట్ల నిధులను ఖర్చు చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని, ఫలితంగా ప్రాజెక్టుల వ్యయం పెరుగుతోందని కేంద్ర మంత్రి గారికి వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
👉 ఈ సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , వేం నరేందర్ రెడ్డి , డాక్టర్ మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్ , గడ్డం వంశీకృష్ణ , డాక్టర్ కడియం కావ్య , ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాధ్ దాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
