పాతబస్తీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయాలి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR ,       

                 
హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)పై ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి  పలు ఆదేశాలిచ్చారు.

👉 ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ కారిడార్‌లో పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.


👉 హైదరాబాద్ మెట్రోకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌లను జత చేయాలని చెప్పారు. ఇందుకు అవసరమైన కోచ్‌ల కొనుగోలు ప్రక్రియకు చర్యలు తీసుకోవాలన్నారు.


👉 మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్‌కు సంబంధించి ప్రస్తుత సాంకేతికతపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి, అవసరమైన సలహాలు తీసుకోవాలని సూచించారు.


👉 ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ , సలహాదారులు రామకృష్ణారావు , ఎన్వీఎస్ రెడ్డి , మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ , అదనపు ఎండీ అజిత్ రెడ్డి  పాల్గొన్నారు.