👉 అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR ,
తెలంగాణలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించేలా డిసెంబర్‌లో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
👉 వ్యాపార రంగంలోని వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్‌లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు .
👉 తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు .
👉 గత ఏడాది నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, వాటి పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను నివేదించాలని ఆదేశించారు .
👉 పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు..
👉 ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ , సలహాదారులు రామకృష్ణారావు , ఉన్నతాధికారులు పాల్గొన్నారు .
