👉 కాలభైరవ స్వామి, ఆంజనేయ స్వామి, చండీశ్వర స్వామిల ప్రతిష్ట మహోత్సవం !
👉 ఈనెల 26 ఆగస్టు బుధవారం రోజున..
J.SURENDER KUMAR,
పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామంలో అతి పురాతనమైన
స్వయంభూ శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో
శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ చండీశ్వర స్వామి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమాలు ఈనెల 26న అత్యంత వైభవంగా జరగనున్నది.

శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు పుష్పగిరి పీఠాధిపతులు నిర్ణయించిన సుముహూర్తము మేరకు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయములకు చెందిన ప్రధాన అర్చకుల వేద పండితులు ప్రతిష్టా కార్యక్రమంలో శ్రీ నాగలింగేశ్వర స్వామి పున ప్రతిష్ట జరగనున్నది.

2023 సంవత్సరంలోరాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ కోలేటి దామోదర్ శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయము నిర్మాణం చేసి యతీశ్వరులైన శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశ్వరులు శ్రీ విద్యాశంకరభారతీ మహా స్వామి విగ్రహా ప్రతిష్టాపన చేశారు.


గ్రామ ప్రజలు చుట్టుపక్క గ్రామల భక్తజనం, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించాల్సిందిగా ఆలయ చైర్మన్ పోతురాజుల భూమయ్య, సర్పంచ్ సోమ కుమార్, గౌరవ అధ్యక్షులు గుమ్మడి విజయ్ ,ప్రధాన అర్చకులు పనకంటి రాజేశ్వర్ శర్మ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
