👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు వివరించారు.
👉 బ్రిటన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు.
👉 ప్రజాప్రతినిధులందరూ నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెంచాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
👉 భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ అనుమతులకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

👉 ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వర్ రావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క గారు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్ , బీర్ల ఐలయ్య , వేముల వీరేశం పాల్గొన్నారు.
👉 ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , వేం నరేందర్ రెడ్డి, కడియం కావ్య గారు, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరయ్యారు.
👉 అలాగే ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, వీర్లపల్లి శంకర్, ప్రేమ్ సాగర్ రావు, నవీన్ యాదవ్, మట్టా రాగమాయి, మందుల సామేల్, వేడ్మ బొజ్జు, కోరం కనకయ్య , లక్ష్మీకాంతరావు, రాందాస్ నాయక్ , కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, బత్తుల లక్ష్మారెడ్డి, మనోహర్ రెడ్డి , తెల్లం వెంకట్ రావు, నాగరాజు , రేవూరి ప్రకాష్ రెడ్డి, మురళి నాయక్, యశస్విని రెడ్డి పాల్గొన్నారు.
