👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఆలయాలు మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. గ్రామ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి నియోజకవర్గ పెగడపల్లి మండలం రాంభద్రునిపల్లె గ్రామంలో శుక్రవారం నూతనంగా నిర్మించనున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

దేవాలయ నిర్మాణానికి తన వంతుగా అవసరమైన సహాయాన్ని అందిస్తానని మంత్రి తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణంలో భాగస్వాములైతే “ఇది మన గుడి” అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుందని అన్నారు. గ్రామ ప్రజల ఐక్యత, భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు.

శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు ఆధ్యాత్మికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్న గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులను మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
