👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట్ చేరుకున్న ముఖ్యమంత్రి వివిధ విద్యా సంస్థల భవన సముదాయాల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
👉 ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా ప్రభుత్వ వైద్య, వెటర్నరీ, నర్సింగ్, పిజియోథెరపీ, పారామెడికల్, ఇంజనీరింగ్ కాలేజీ, 400 పడకల ఆసుపత్రితో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు, హాస్టళ్ల భవన సముదాయాలను పరిశీలించారు.

👉 ఎడ్యుకేషన్ హబ్‌లో జరిగే అన్ని నిర్మాణాల విషయంలో సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. నిర్మాణాల్లో నాణ్యత, ఇతర సాంకేతిక అంశాల విషయాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
👉 వర్షాల సమయంలో నీరు నిలవకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్‌ను ఏర్పాటు చేయాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి ల్యాండ్‌స్కేపింగ్ పనులకు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.
