ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి కి చాకలి ఐలమ్మ ఆదర్శం !

👉 ధర్మపురి చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి !


J.SURENDER KUMAR,


భూమి కోసం, భుక్తి కోసం, పేదల హక్కుల కోసం దొరల పెత్తనానికి, అన్యాయాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన ధైర్యసాహసాలు, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని ధర్మపురి మున్సిపల్  చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి అన్నారు.


రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం పట్టణంలోని స్థానిక నంది చౌక్ వద్ద ఉన్న ఆమె విగ్రహానికి  చైర్ పర్సన్  వేముల నాగలక్ష్మి  పూలమాల వేసి నివాళులర్పించారు.

👉 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…..

మహిళా చైతన్యానికి, సామాజిక న్యాయానికి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చైర్ పర్సన్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ సంఘనబట్ల దినేష్ , కౌన్సిలర్లు చిపిరిశెట్టి రాజేష్ , సంగి ఆనంద్ గారు, రజకసంఘ అధ్యక్షులు కొనపర్తి రాజేందర్, కార్యవర్గం సభ్యులు తదితరులు  పాల్గొన్నారు.

👉 టీ బీ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి !

పట్టణంలోని 9వ వార్డు ఇందిరమ్మ కాలనీలో బస్తీ దవాఖానలో జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీబీ (క్షయ) పరీక్షల కార్యక్రమాన్ని  చైర్ పర్సన్  వేముల నాగలక్ష్మి  ప్రారంభించారు.

👉ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ..

దూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోలేని పేద ప్రజలకు ఎటువంటి ఖర్చు లేకుండా బస్తీ దవాఖానల్లోనే టీబీ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఎలాంటి ఖర్చు లేకుండా ప్రజలకు ఈ వైద్య సేవలను అందిస్తోందని అన్నారు.

టీబీ ఒక తీవ్రమైన వ్యాధి అయినప్పటికీ, సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చని పేర్కొన్నారు. టీబీ లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.


ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉచితంగా టీబీ పరీక్షలు చేయించుకోవాలని, అనుమానిత లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో Dy DMHO DR.శ్రీనివాస్ , డాక్టర్. వివేక్ , స్టాఫ్ నర్స్ రాణి  బస్తి దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.