👉 ధర్మపురి చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి !
J.SURENDER KUMAR,
మాజీ సీఎం కేసీఆర్ దళిత సామాజిక వర్గానికి న్యాయం చేయాలనుకుంటే, స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి డిమాండ్ చేశారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బిఆర్ఎస్ఎమ్మెల్సీల అనుచిత వ్యాఖ్యానలు, దళితులు నడిచిన నేను శుద్ధి పేరిట పసుపు నీళ్లు చల్లడం, తదితర సంఘటన నేపథ్యంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.
👉 ఈ సందర్భంగా చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ.. .

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హామీ, ఆచరణకు నోచుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదుగురు దళితులకు మంత్రి పదవులు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.
అదేవిధంగా, దళిత నాయకులు కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడించిన సందర్భంలో, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఫామ్‌హౌస్‌ను శుద్ధి చేశారంటూ ఆమె తీవ్రంగా విమర్శించారు. దళిత నాయకులు ఫామ్‌హౌస్‌ను ముట్టడించినందుకు అనంతరం శుద్ధి చేయడం దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్య అని
దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆమె అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ సంఘనబట్ల దినేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్ , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చిపిరిశెట్టి రాజేష్ ,కుంట సుధాకర్, కౌన్సిలర్లు సంగి ఆనంద్ , ముడుసుల ప్రశాంత్ , వొజ్జల లక్ష్మణ్ ,విరవేణి నాగలక్ష్మి , చుక్క సంధ్య ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
