ఆయుధాల దొంగ రిటైర్డ్ ఆర్మీ హవల్దార్‌ అరెస్ట్ !

👉 బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగార దొంగతనం చేదించిన పోలీసులు !

👉 దాదాపు 8.5 లక్షల మొబైల్ నంబర్లు కాల్ డాట పరిశీలన!

👉 డిజిపి సివి ఆనంద్ మీడియా సమావేశంలో !


J . SURENDER KUMAR,


బొల్లారంలోని 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దొంగిలించిన రిటైర్డ్ ఆర్మీ హవల్దార్‌ను అరెస్టు చేసినట్లు  పోలీసులు శుక్రవారం, ప్రకటించారు.

విలేకరుల సమావేశంలో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సివి ఆనంద్ మాట్లాడుతూ, నిందితుడిని నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, జంగంరెడ్డిపల్లికి చెందిన 37 ఏళ్ల ఉప్పుతోళ్ల మల్లేష్‌గా గుర్తించినట్లు తెలిపారు.


మల్లేష్ 2010లో సైన్యంలో చేరిన తర్వాత 16 ఏళ్లపాటు బెటాలియన్‌లో పనిచేశారు, మరియు ఈ ఏడాది జూన్ 30న ఆరోగ్య, క్రమశిక్షణా కారణాల వల్ల డిశ్చార్జ్ అయ్యారు. అని తెలిపారు.


👉 డిజిపి తెలిపిన వివరాలు…..


👉 ప్రధాన అనుమానితుడు: 16 ఏళ్ల పాటు సేవలందించిన 37 ఏళ్ల రిటైర్డ్ హవల్దార్ఉప్పుతోళ్ల మల్లేష్(అలియాస్ రాజు)ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు .


👉 ఉద్దేశం: ఆరోగ్య, క్రమశిక్షణా సమస్యల కారణంగా 2026 జూన్ 30న ముందస్తు పదవీ విరమణ చేయవలసి రావడంతో, నిందితుడు తన పై అధికారులపై కక్ష పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు.


👉 స్వాధీనం చేసుకున్న ఆయుధ సామగ్రి: అధికారులు నాలుగు ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు, ఆరు 9ఎంఎం పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, నైట్-విజన్ పరికరాలు మరియు వేలాది రౌండ్ల మందుగుండు సామగ్రిని స్వాధీనం .

👉 దర్యాప్తు: ఈ కేసును ఛేదించేందుకు టాస్క్ ఫోర్స్, ఎస్ఓటి, స్థానిక పోలీసులు, మిలిటరీ ఇంటెలిజెన్స్ వంటి బహుళ ఏజెన్సీలు సుమారు 8.5 లక్షల మొబైల్ నంబర్లను విశ్లేషించాయని, ఈ దర్యాప్తు వివరాలను డిజిపి సి.వి. ఆనంద్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.