👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రజల విజ్ఞప్తి !
J.SURENDER KUMAR,
వేలాది సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన జగిత్యాల జిల్లా
బీర్పూర్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించండి అంటూ , ఆలయ పాలకవర్గ చైర్మన్ ధర్మకర్తలు, గ్రామ సర్పంచ్, అర్చకులు గ్రామ ప్రజలు గురువారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు.
👉 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…….
శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చి మొక్కలు తీర్చుకుంటారని, ఈ క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు విస్తరించాల్సి ఉందని మంత్రి కి వారు వివరించారు. ఇప్పటికే దాతలు, భక్తుల సహకారంతో కోటి రూపాయల వ్యయంతో ఆలయ మండపం వెడల్పు, గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు.

👉 ఆలయ సమగ్ర అభివృద్ధికి దాదాపు ₹ 5 కోట్ల నిధులు అవసరమని, ఇందులో భాగంగా ప్రాకార మండపం, యాగశాల, హనుమాన్ మందిరం, రాజగోపురం, ఆలయం చుట్టూ విస్తరణ, కోనేరు పునర్నిర్మాణం, ఘాట్ రోడ్డు వెడల్పు, జాతర ప్రాంతానికి వచ్చే రెండు రహదారుల విస్తరణతో పాటు శిథిలావస్థకు చేరిన రథశాల పునర్నిర్మాణానికి ప్రభుత్వం తరపున ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ,…..

ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చీర్నెని శ్రీనివాస్, స్థానిక. సర్పంచ్ ఎలమట్ల హరీష్, ఉప సర్పంచ్ జితేందర్, ఆలయ కమిటీ సభ్యులు చల్ల లక్ష్మణ్ యాదవ్. చెన్న గంగాధర్ ఎనగంటి సతీష్, యశోద రమేష్, చెట్టిపల్లి సత్యనారాయణ, జైన మాజీ సర్పంచ్ కుంట సుధాకర్. ఆలయపూజారులు, పెద్ద సంతోష్ , చిన్న సంతోష్ , మధు తదితరులు పాల్గొన్నారు.
