స్టీల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J SURENDER KUMAR,


హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఫ్లైఓవర్ డిజైన్లకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను పరిశీలించిన అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు.


👉 ₹ 620 కోట్ల వ్యయంతో 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , మహమ్మద్ అజారుద్దీన్ , ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , వేం నరేందర్ రెడ్డి , అసదుద్దీన్ ఓవైసీ , కె. రఘువీర్ రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలాతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.