సీఎం రేవంత్ రెడ్డి ఇంటిలో గణపతి పూజలు !


J.SURENDER KUMAR,


వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి  సోమవారం జూబ్లీహిల్స్‌ లోని నివాసంలో కుటుంబ సమేతంగా గణపతి పూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి, ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని సీఎం ప్రార్థించారు.

తెలంగాణ ప్రజల ఆటంకాల తొలగింపు, శ్రేయస్సు, సౌభాగ్యాల కోసం ముఖ్యమంత్రి ప్రార్థించారు ఆయన  మనవడితో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. గణపతి ప్రతి ఇంటికి ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సును ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ రేవంత్ రెడ్డి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా ప్రధాన గణేష్ మండపాల వద్ద ట్రాఫిక్ ఏర్పాట్లు, జనసమూహ నియంత్రణ సజావుగా జరిగేలా చూడాలని ఆయన పోలీసులకు, స్థానిక అధికారులకు సూచించారు. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గణేష్ మండపాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని కూడా ఆయన పునరుద్ఘాటించారు.

👉 ధర్మపురిలో మంత్రి లక్ష్మణ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో వినాయక చవితి పూజలు !

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురిలో మంత్రి లక్ష్మణ్ కుమార్  క్యాంపు కార్యాలయం వినాయక చవితి పూజలు ఘనంగా జరిగాయి.  క్యాంపు కార్యాలయంలో వినాయక విగ్రహం ప్రతిష్టించి వేదమంత్రాలతో పూజలు జరిపారు.

పూజా కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ తో పాటు స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి దంపతులు ధర్మపురి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, తోపాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.