వినాయక చవితి శుభాకాంక్షలు సీఎం రేవంత్ రెడ్డి !


J . SURENDER KUMAR,


విఘ్నాలను తొలగించి.. విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, పవిత్రమైన “వినాయక చవితి” సందర్భంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఆదిదేవుడైన గణనాథుని కరుణాకటాక్షాలతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి  ఆకాంక్షించారు. సమాజంలో సౌభ్రాతృత్వం, సద్భావన, మానవతా విలువలు మరింత పరిఢవిల్లాలని కోరుకున్నారు.


సకల సంకల్పాలకు విఘ్నాలు తొలగించి, మన అడుగులకు విజయబాటలు వేయాలని.. జ్ఞానాన్ని, ధైర్యాన్ని, సత్ప్రవర్తనను ప్రసాదించాలని ఆదిపూజ్యుడైన ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థిద్దామని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత శోభాయమానంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

👉 భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి !

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

వినాయక చవితి పర్వదినం సందర్భంగా, రాష్ట్ర, జిల్లా, ధర్మపురి, నియోజకవర్గ ప్రజలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో  జరుపు కోవాలి. అధికార యంత్రాంగం అమలు చేస్తున్న నిబంధనలను ప్రతీ మండప నిర్వాహకులు పాటించాలి మంత్రి విజ్ఞప్తి చేశారు.

సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించాలి పోలీసులు, అధికారులకు ఆయా మండపాల నిర్వాహకులు సహకరించాలి కోరారు.