ధర్మపురి ఆలయ పునఃనిర్మాణము పూజలు !

👉 రేపు తెల్లవారుజామున కళావరోహనము శంఖుస్థాపన !


J.SURENDER KUMAR,


గోదావరి పుష్కరముల నిధులు ₹10 కోట్లతో చేపట్టనున్న ధర్మపురి శ్రీ ఉగ్రనరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణము పూజలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి.. స్థానిక వేద పండితులతో పాటు హైదరాబాద్ కిషోర్ స్వామి బృందం(16) మందితో జరుగుతున్నాయి.


👉 ముహూర్తం 

ఈ నెల 7 న సోమవారం  ప్రాత: కాలం (ఉదయం) 2-58 ని॥లకు కళావరోహనము శంఖుస్థాపన కార్యక్రమము జరగనున్నది.
శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్, ఆలయ అర్చకులు, వేద పండితులు, స్థానికులు పాల్గొననున్నారు.


శనివారము ఉ॥8-30 ని॥లకు వేదపఠనము, పుణాహవచనము, తిరుప్పావై శ్రీప్రబందపారాయణము, అగ్నిమథనము చేయుట జరిగినది. అగ్నిప్రతిష పంచసూక్తహవనము, మూలమంత్ర హవనము, స్థాపితదేవతామంత్ర హవనము, మధ్యాహ్నము 12-30 ని॥లకు జరుగు కార్యక్రమాలు, సాయంత్రం 5-30ని॥లకు యధాక్రమంగ వేదపఠనము, హవనము నివేదన, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ కొనసాగాయి.