మంథనిలో వెయ్యి రోజుల పాలనపై విజయోత్సవ ర్యాలీ !


J.SURENDER KUMAR,


రాష్ట్ర ఐటి & పరిశ్రమలు శాసన సభ వ్యవహారల మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న  దుద్ధిళ్ల శ్రీధర్ బాబు  నియోజకవర్గ కేంద్రమైన  మంథని పట్టణం లో సోమవారం  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పై  కాంగ్రెస్ శ్రేణులువిజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.


👉ప్రజా సంక్షేమం అభివృద్ధి రైతు సంక్షేమం యువతకు అవకాశాలు అనే లక్ష్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు.


👉 ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా….మండల పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలు శివ ఆధ్వర్యంలో  జరిగింది.

👉 ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి నాయకులు కాంగ్రెస్ మండల్ పార్టీ అధ్యక్షులు అయిలి మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వ్యవసాయ కమిటీ చైర్మన్ కూడుదుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఎలక్ట్రిసిటీ బోర్డు మెంబెర్ శశిభూషన్ కాచే, ఎస్సి సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, ఎస్సి సెల్ మండల్ అధ్యక్షులు మంథని రాకేష్, మాజీ మార్కెట్ చైర్మన్ ఉప్పట్ల శ్రీనివాస్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎరుకల ప్రవీణ్, నూకల బాణయ్య, అజీమ్ ఖాన్, గుంజపడుగు సర్పంచ్ దండవేన సంధ్య తదితరులు వారి మాటలలో…


👉 ఈ ర్యాలీలో మాజీ MLA పుట్ట మధు చేసిన వాక్యలను ఖండిస్తూ మంథని అంబేద్కర్ చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు


👉 మీ పార్టీ పెట్టిన సిద్ధాంతం ఏంది మీరు మాట్లాడే మాటలు ఏమిటి పార్టీ సిద్ధాంతాలను మరిచి మా నాయకులు మంత్రి శ్రీధర్ బాబు  పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.


👉 గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు అభివృద్ధి అని చెప్పుకుంటున్నటువంటి పనులను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే కాలేశ్వరం అవినీతికి పాల్పడి నాణ్యతలేని పనులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఓడేడు బ్రిడ్జి గాలికి కొట్టుకపోయిందని మంథని మాతశిశు ఆసుపత్రి చెరువులో కట్టి వర్షం వాటర్ తోనే హాస్పిటల్ మునిగి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు.


👉 రాష్ట్ర అప్పుల పాలు చేశారు  పుట్ట మధు  మీ టిఆర్ఎస్ నాయకులే శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తున్నారు గతంలో కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పడు అప్పుడు ఏం చేశావని ఎద్దేవా చేశారు.


👉 మంథనిలో కనివిని ఎరుగని రీతిలో 50 పడగల ఆసుపత్రి,ఇంటిగ్రేటెడ్ కార్యాలయం, వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, 90 ఫీట్ల రోడ్లు విశాలవంతమైన నాలుగు లైన్ల రోడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అదేవిధంగా మా సార్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ అఫ్ ఆల్ ముందుగా కేసీఆర్ ను  అడుగు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులకు హుకుం జారీ చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఇంకోసారి మా నాయకులు శ్రీధర్ బాబు  పైన శ్రీను బాబు  పైన అనుచిత వాక్యాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.  మంథని ప్రాంతం మంత్రి శ్రీధర్ బాబు తోనే అభివృద్ది సాధ్యం అని అన్నారు.


👉 తెలంగాణలో మహిళలకు TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం ఒక విప్లవాత్మక మార్పు. ఇప్పటివరకు ₹ 335 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు జరిగాయి. దీనివల్ల పేద మహిళలకు నెలకు . ₹1000-1500 ఆదా అవుతోంది.53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. దీనివల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి దాదాపు ₹ 12,000 లబ్ది. 43 లక్షల మంది అర్హులైన కుటుంబాలకు కేవలం ₹ 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు.


👉 కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు – ఇల్లు లేని ప్రతి పేదవాడికి ₹ 5 లక్షలతో సొంత ఇల్లు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. మెగా DSC ద్వారా 11,000 టీచర్ పోస్టులు, గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్ ఉద్యోగాలు. నిరుద్యోగ యువతకు ఉచిత స్కిల్ ట్రైనింగ్.₹  2 లక్షల వరకు రైతు రుణమాఫీ పూర్తి – 25 లక్షల 35 వేల రైతు కుటుంబాలకు ₹ 21,000 కోట్ల లబ్ది.రైతులకు పెట్టుబడి సాయంగా ₹ 36,000 కోట్లకు పైగా జమ. మొత్తం వ్యవసాయ రంగానికి ₹ 1.68 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ నివేదిక.


👉 ధాన్యం సేకరణలో రికార్డు కొనుగోళ్లు చేస్తున్నాం.తెలంగాణ పంజాబ్‌ను దాటి వరి సాగులో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచింది. గత రబీలో 81.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రికార్డు సృష్టించింది.సన్న బియ్యం పథకం.3.42 కోట్ల మందికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ.


👉 TG-iPASS ద్వారా ₹ 1.29 లక్షల కోట్ల పెట్టుబడులు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ₹ 5.75 లక్షల కోట్ల ఒప్పందాలు. TSIIC భూముల్లో ₹ 92,281 కోట్ల పెట్టుబడులతో 78,000 ఉద్యోగాలు. లైఫ్ సైన్సెస్ పాలసీ ద్వారా మరో 3.5 లక్షల ఉద్యోగాలు లక్ష్యం.IT రంగంలో అగ్రగామి.IT ఎగుమతులు ₹ 3.97 లక్షల కోట్లు దాటాయి. 12 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించమని అన్నారు.


👉 ఈ కార్యక్రమంలో…..
మున్సిపల్ కౌన్సిలర్లు,గ్రామ సర్పంచ్ లు, గ్రామ ఉప సర్పంచ్ లు, మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయుకులు, వార్డుసభ్యులు,ప్రజా ప్రతినిధులు మరియు అన్ని విభాగల నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు