మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!

J SURENDER KUMAR,


కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి పనులతో మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


బుగ్గారం మండల కేంద్రంలో  ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయినా మండలంలోని 56 మంది లబ్ధిదారులకు ₹ 15,54,400 విలువైన చెక్కులను మంత్రి లక్ష్మణ్ కుమార్  లబ్ధిదారులకు ఆదివారం అందించారు. ఇదే వేదికపై మండలంలోని వివిధ గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియమించగా నియామక పత్రాలను మంత్రి అందించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

  బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల చేసిన అవినీతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అసెంబ్లీలో వివరించారు అని మంత్రి అన్నారు. అసెంబ్లీ సమావేశాల లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతారని భావించామని అయితే అసెంబ్లీకి రాకుండానే ప్రజా సమస్యలపై చర్చించకుండా రాద్ధాంతం చేసి బయటికి వెళ్లారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని , రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు గ్యారంటీలు అమలు చేస్తుందని రానున్న రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలు చేయడానికి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చర్యలు తీసుకుంటున్నారని  మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని మంత్రి  పిలుపునిచ్చారు.

👉 తాను ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని మంత్రి  స్పష్టం చేశారు. ధర్మపురిలో మూతపడిన నైట్ కళాశాలను తెరిపించడంతో పాటు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని  తెలిపారు. రోళ్ళవాగు ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు అక్కపల్లి లిఫ్ట్ పనులు పూర్తి చేస్తామని రంగధాంపల్లి చెరువు పూడిక తీయడంతో పాటు  యశ్వంతరావుపేట చెరువు పూడిక తీసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

👉 గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున నిధులు తీసుకు వస్తున్నామని ఇప్పటికే ప్రభుత్వం ధర్మపురి నియోజకవర్గానికి గోదావరి పుష్కరాలకు ₹ 117 కోట్లు కేటాయించిందని అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించిందని మంత్రి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి రాత్రి పగలు తేడా లేకుండా కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు.

👉 ధర్మపురి కి బస్ డిపో సాధించడంతోపాటు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విస్తృత ప్రచారం చేయాలని మంత్రి కోరారు. బుగ్గార మండలం సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి తెలిపారు.

👉 ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి !


బుగ్గారం మండల కేంద్రంలో సజీరా రహీముద్దీన్ కు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ప్రారంభించారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి అడ్లూరి తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, బుగ్గారం మండల పార్టీ అధ్యక్షులు నర్సాగౌడ్, మాజీ జెడ్పిటిసి బాదినేని రాజేందర్, శేకల్ల సర్పంచ్ రమేష్ సకల, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సుభాష్ తో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.