PRTU జిల్లా అధ్యక్షుడిగా రొట్టె శ్రీనివాస్ !

👉 పిఆర్ టియు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ప్రకటన !

J . SURENDER KUMAR,


సీనియర్ ఉపాధ్యాయ సంఘ నాయకుడు ,రొట్టె శ్రీనివాస్ ను, జగిత్యాల జిల్లా పి ఆర్ టి యు (PRTU )  అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు, మరియు
టిపిసిసి అధికార ప్రతినిధి  గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ప్రకటించారు.

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణంలో ఆదివారం జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో రొట్టె శ్రీనివాస్ PRTU రాష్ట్ర అధ్యక్షుడు ద్వారా సభ్యత్వం స్వీకరించారు.


ప్రధాన కార్యదర్శి గా నరుకుల్లా శ్రీధర్ ను నియమించారు.
ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా పి ఆర్ టి యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు టిపిసిసి అధికార ప్రతినిధి అయిన గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.


👉 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

👉 ప్రభుత్వము పిఆర్సి పట్ల తాత్సారం, నాన్చివేత ధోరణి విడనాడి PRC ని వెంటనే అమలు చేయలి.

👉 పెండింగ్ లో ఉన్న 6 DAలను ప్రకటించాలి.

👉 CPS రద్దు చేసి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానము వర్తింప చెయాలి.

👉 DSC 2003 ఉపాధ్యాయులకు మెమో No. 57 ప్రకారం పాత పెన్షన్ వర్తింపజేయాలి.

👉 ఉపాధ్యాయులకు బదిలీలతో కూడిన పదోన్నతుల షెడ్యూల్ ఈ నెలలోనే విడుదల చేయాలి.

👉 317 G.0. ప్రభావం వల్ల వేరే జిల్లాలకు బదిలీ కాబడిన భార్యాభర్తలైన ఉపాధ్యాయుల బదిలీలను పూర్తి చేసి వారికి న్యాయం చేయాలి.

👉 మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 ట్రెజరి పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలి.

👉 సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలి.

ఈ  సమావేశంలో పి ఆర్ టి యు తెలంగాణ  రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాతూరి రాజ్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగులవంచ చంద్రశేఖర్ రావు, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతిరి తిరుపతి రెడ్డి, పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర, జిల్లా నాయకులు పల్లెపాటి వేణుగోపాల్ రావు, చొల్లేటి శ్రీనివాస్, పులిపాక కిషన్, N. శ్రీధర్, K. హరేందర్ రెడ్డి, అట్ల శ్రీనివాస్ రెడ్డి, రాచమల్ల శ్రీనివాస్, కనకయ్య , మహేందర్ తదితరులు పాల్గొన్నారు.