J.SURENDER KUMAR,
విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర జగిత్యాల జిల్లా ప్రజలకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
శుభాకాంక్షలు తెలిపారు.
దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని, ప్రజా పాలన ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యంలో విజయం సాధించాలని మంత్రి ప్రకటనలో ఆకాంక్షించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ ప్రతి ఇంటా ఆనందోత్సాహాలను నింపాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, సానుకూలత, విజయాలను తీసుకురావాలని మంత్రి పేర్కొన్నారు.
