ధర్మపురి బస్ స్టేషన్ కు గోదావరి పుష్కర శోభ..!

👉 ₹ 2.57 కోట్ల అంచనా వ్యయంతో  ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి ఆర్టీసీ బస్ స్టేషన్ కు మహర్దశ పట్టింది. ఆదివారం మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పట్టణంలో పర్యటించి బస్ స్టేషన్ అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు..

👉 బస్ స్టేషన్ ఆధునీకరణ లో భాగంగా రెండు ప్లాట్‌ఫారాల విస్తరణ, గ్రానైట్ ఫ్లోరింగ్, కొత్త టాయిలెట్ బ్లాక్ నిర్మాణం, సీసీ పేవ్‌మెంట్, వర్షపు నీటి పారుదల, విద్యుదీకరణ, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయనున్నారు.


👉 ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ధర్మపురి బస్ స్టేషన్ అభివృద్ధి..


👉 కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి రాజు, లైబ్రరీ చైర్మన్ దినేష్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్టీసీ ఈడి లు ,ఆర్ఎంలు, ఇతర ముఖ్య నేతలు, అధికారులు

👉 మంత్రి పొన్నం ప్రభాకర్ స్పీచ్ లో హైలెట్స్..!

👉 ₹ 2.57 కోట్ల రూపాయల తో ధర్మపురి నూతన బస్ స్టేషన్ అభివృద్ధికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది.

👉 రాబోయే పుష్కరాల్లో ఈ ప్రాంత ప్రజలకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ బస్ స్టేషన్ అభివృద్ధి చేసుకుంటున్నాం

👉 2027 లో జరిగే గోదావరి పుష్కరాలకు బాసర నుండి భద్రాచలం వరకు ఆర్టీసీ బస్ స్టేషన్ లు మౌలిక సదుపాయాల కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళికా ద్వారా ముందుకు పోతుంది

👉 గోదావరి తీరంలోని అన్ని దేవాలయాల బస్ స్టేషన్లను అభివృద్ధి చేసుకుంటున్నాం

👉 బాసర ,భద్రాచలం ,ధర్మపురి , గూడెం,కాళేశ్వరం అన్ని బస్ స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం

👉 ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం

👉 ఇప్పటి వరకు 367 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి దాదాపు 13 వేల కోట్లు ఆదా చేసుకున్నారు

👉 మహా లక్ష్మీ ద్వారా ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్ వెళ్ళేలా ప్రణాళికలు వేస్తున్నాం

👉 ధర్మపురి నుండి బాంబే కి ఆర్టీసీ బస్ వేసేలా అధికారులు పరిశీలించాలని ఆదేశిస్తున్న

👉 కరీంనగర్ ,జగిత్యాల ,ధర్మపురి లింక్ రాత్రి కూడా బస్ నడిచేలా ప్రణాళికలు వేస్తున్నాం

👉 1993 లో బస్ స్టేషన్ ప్రారంభి 2026 లో అభివృద్ధి చేసుకుంటున్నాం

👉 ధర్మపురి మున్సిపాలిటీ లో అడ్లూరి లక్ష్మణ్ కుమార్  నేతృత్వంలో 15 కౌన్సిలర్ స్థానాలకు 15 గెలుచుకోవడం అభినందనీయం.

👉 ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ప్రాంతానికి బస్ డిపో ఇస్తాం.. స్థల సేకరణ చేయండి.. ఎన్నికలకు డిపో కి ఫౌండేషన్ వేసిన తర్వాతనే పోతాం!

👉 బస్ డిపో ల డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ ఇక్కడ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది బస్ డిపో కార్యాచరణ జరగాలని లక్ష్మీ నరసింహ వారిని వేడుకుంటున్న.!

👉 మా ప్రభుత్వ వచ్చిన తర్వాత ములుగు పెద్దపల్లి బస్ డిపో లు ఏర్పాటు చేశాం

👉 మా దగ్గర హుస్నాబాద్ ఎల్లమ్మ కొత్తకోండ ఆలయం అభివృద్ధి చేస్తున్నాం..

👉 ఇక్కడ బస్సుల సంఖ్య పెంచుతాం..ప్రయాణికులు ఆదరించాలి..

👉 వేల సంఖ్యలో బస్ లు కొనుగోలు చేశాం పి ఆర్ సి లు డి ఏ లు  ఇచ్చాం..సర్వీసు నుండి రిమూవ్ అయిన వారికి ఉద్యోగాలు ఇచ్చాం..

👉 మా ప్రభుత్వం వచ్చిన తరువాత హైదరాబాద్ నగరంలోని అనేక కొత్త కాలని కు ,గ్రామాలకు కొత్త బస్సులు ఏర్పాటు చేస్తున్నాం..

👉 బస్ లు అవసరమైన గ్రామాలకు విజ్ఞాపన ఇవ్వండి పరిశీలించి బస్సులు ఇస్తున్నాం..గత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే అనేక పథకాలు ప్రారంభించాం.

.👉 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గత 10 సంవత్సరాల ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు..మేము అర్హత ఉన్న అందరికీ నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశాం,సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం..సన్న వడ్ల బోనస్ ఇస్తున్నాం..

👉 నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేశాం..

👉 ₹ 5-10 లక్షలకు ఆర్యోగ్య శ్రీ పెంచుకున్నాం..

👉వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తున్నాం..కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తున్నాం..

👉 గురుకుల పాఠశాలల్లో మెస్ చార్జీలు కాస్మొటిక్ చార్జీలు పెంచడం జరిగింది…ప్రభుత్వం విద్యా ,వైద్యం , ఉపాధి,ఇరిగేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం..

👉 మీ అందరి ఆకాంక్ష మేరకు కలిగిస్తున్న ..డిపో స్థల సేకరణ చేసి ప్రతిపాదనలు పంపించండి.. సాధ్యమైనంత త్వరగా ధర్మపురి బస్ డిపో కల సాకారమవుతుంది..

👉 నేను NSUI జిల్లా అధ్యక్షుడిగా ,రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశా.. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కూడా ఉన్న జిల్లా అభివృద్ధిలో శ్రీధర్ బాబు  ,అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అందరం కలిసి అభివృద్ధి చేసుకుంటున్నాం..

👉 ఎల్ నినో ప్రభావం తో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి..

👉 వర్షాలు కురవాలని కొండగట్టు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది.. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో,వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో పూజలు చేయడం జరిగింది..

👉 కరువు తెలంగాణ కి పరిమితం కాలేదు..ప్రపంచమంతా తీవ్ర కరువు ఉంది..లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో ఎల్ నినో పోయి కంచి వర్షాలు కురవాలని వేసుకుంటున్న..