👉 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రూ. 13 వేల కోట్ల మేర లబ్ధి !
👉 మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్..!
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ డిపో మంజూరు చేయడం పక్కా అని.. డిపో నిర్మాణానికి స్థల సేకరణ చేసి నివేదిక పంపించాల్సిందిగా రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ను ఆదేశించారు..
ధర్మపురి బస్‌స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు ₹. 2.57 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆధునీకరణ పనులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ..

1993లో ప్రారంభమైన ధర్మపురి బస్‌స్టేషన్‌ను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ధర్మపురిలో బస్ డిపో ఏర్పాటు చేయాలన్న స్థానిక ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటామని, ఎన్నికలకు ముందే డిపో నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కోరినట్లు వెల్లడించారు.
👉 మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆర్టీసీ సేవల విస్తరణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 360 కోట్ల ఉచిత ప్రయాణాల ద్వారా మహిళలకు దాదాపు ₹ 13 వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు.
👉 ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలు..!
విస్తరించడంతోపాటు బాసర, భద్రాచలం, ధర్మపురి, గూడెం, కాళేశ్వరం తదితర పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ధర్మపురి నుంచి ముంబైకి ఏసీ బస్సు నడిపే ప్రతిపాదనను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.
