J.SURENDER KUMAR,
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ 4న నిర్వహించనున్న సదర్ ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ఈ సందర్భంగా ప్రతినిధులు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ , రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ , జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ , యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ , మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ తో పాటు ఇతర ప్రతినిధులు ఉన్నారు.
