ఎల్‌నినో తో ప్రత్యామ్నాయ పంటల పై రైతులు దృష్టి పెట్టాలి!

👉 రైతులకు శాస్త్రీయ సూచనలు, సలహాలు అందించాలి !

👉 పంటలు ఎండి పోకుండా విద్యుత్ సరఫరా చేయాలి !

👉 మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్…!


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లాలో వ్యవసాయ శాఖ ఆత్మ (ATMA) అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ సౌజన్యంతో బుధవారం నిర్వహించిన కిసాన్ మేళా–2026 కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు.


ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రైతులకు అందించాల్సిన సహాయ సహకారాల పై వారు వివరించారు.

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….


వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వల్ల వ్యవసాయ రంగంలో ఎదురయ్యే పరిస్థితులను రైతులు ముందుగానే అంచనా వేసుకొని పంటల సాగుపై ప్రణాళిక రూపొందించుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.


👉 రైతులు సంప్రదాయ పంటల సాగుతో పాటు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను కూడా పరిశీలించాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు అందించే సలహాలు, సూచనలను పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని పేర్కొన్నారు. నీటి లభ్యత, నేల స్వభావం, పంటకు అయ్యే పెట్టుబడి, మార్కెట్‌ లో ఉన్న డిమాండ్‌ ను పరిగణనలోకి తీసుకొని పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా రైతులు మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.


👉 రైతులకు సాగు సమయంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటికి తగిన పరిష్కార మార్గాలను సూచించడం లో వ్యవసాయ శాఖ అధికారులు చురుకైన పాత్ర పోషించాలని మంత్రి సూచించారు. రైతులకు అందుబాటులో ఉండి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరించాలని, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన పద్ధతులపై అవగాహన కల్పించాలని తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.


👉 జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ…


రైతులు వ్యవసాయంలో వస్తున్న ఆధునిక మార్పులను అందిపుచ్చుకొని, శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాల మేరకు ప్రత్యామ్నాయ పంటల సాగును పరిశీలించాలని తెలిపారు.

వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకొని, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. పంటల ఎంపిక నుంచి సాగు, ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ, పంట కోత వరకు ప్రతి దశలో శాస్త్రీయ పద్ధతులను పాటించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.


రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా నూతన వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులు, పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ అనుభవాలతో పాటు శాస్త్రవేత్తల సూచనలను సమన్వయం చేసుకుంటూ వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవాలని ఎమ్మెల్యే కోరారు.


👉 కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..


ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు పంటల సాగులో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడం, వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన పద్ధతులను అనుసరించడం ద్వారా పంట నష్టాల ముప్పును తగ్గించుకోవచ్చని తెలిపారు.


రైతులకు అవసరమైన సమాచారం సకాలంలో అందేలా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, వాతావరణ పరిస్థితులు, పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణకు సంబంధించిన సూచనలు అందించాలని తెలిపారు. రైతులు తమ భూముల స్వభావం, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటలను సాగు చేయాలని పేర్కొన్నారు.


పంటలు ఎండిపోకుండా, రైతులకు సాగు సమయంలో ఇబ్బందులు కలగకుండా అవసరమైన విద్యుత్ సరఫరా అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయానికి అవసరమైన సేవలు సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలని తెలిపారు.

కిసాన్ మేళాల ద్వారా రైతులకు నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనల ఫలితాలు, ఆధునిక సాగు విధానాలపై అవగాహన కల్పించడం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకొని, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ కోరారు.
ఉత్తమ రైతులకు మరియు ఉత్తమ వ్యవసాయ అధికారులకు సన్మానం చేశారు. అనంతరం అధికారులు ప్రజా ప్రతినిధులు రైతులు ప్రతిజ్ఞ చేశారు.


👉 కిసాన్ మేళాలో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన..!


కిసాన్ మేళాలో భాగంగా వ్యవసాయ రంగంలో చేపడుతున్న పరిశోధనలు, నూతన సాగు పద్ధతులు, ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ స్టాళ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఆయా స్టాళ్లలో ప్రదర్శించిన వ్యవసాయ పద్ధతులు, పంటల నిర్వహణ విధానాలు, రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం గురించి సంబంధిత నిపుణులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు వివిధ పంటల సాగులో పాటించాల్సిన పద్ధతులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాల్సిన విధానం, నీటి వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల సంరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. రైతులు తమ సందేహాలను నిపుణులను అడిగి తెలుసుకొని, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ఆచరణలో పెట్టాలని సూచించారు.


కిసాన్ మేళా ద్వారా రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలపై అవగాహన పెంపొందించడంతో పాటు, వ్యవసాయాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సమాచారాన్ని అందించారు.


ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.