మంథనికి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తాం!

J.SURENDER KUMAR,


మంథని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామని టీజీఎల్పిడిసిఎల్ సిఎండి ఐఏఎస్ అధికారి వరుణ్ రెడ్డి హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు నిత్యం అప్రమత్తం చేస్తూ పంటలకు సాగు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తున్నట్టు సీఎం డి తెలిపారు

మంథని నియోజకవర్గంలో విద్యుత్తు సరఫరా మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం కాంగ్రెస్ నాయకుడు, న్యాయవాది, శశిభూషణ్ కాచే,  మార్కెట్ కమిటీ చైర్మన్ కే . వెంకన్న సీఎండికి వినతి పత్రం ఇచ్చారు.