J .SURENDER KUMAR,
గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు దర్యాప్తుకు సహకరించకుండా, పోలీసులపై అసత్య కథనాలు ప్రచురిస్తూ విధులకు ఆటంకం కలిగిస్తున్న ‘ఏగ్ధం న్యూస్’ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
👉 వివరాలు ఇలా ఉన్నాయి..
గంభీరావుపేట ఎస్సైతో పాటు, ఇతర సిబ్బందిపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ, దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా వరుస కథనాలు ప్రచురించినందుకు గాను పత్రిక ఎడిటర్/నిర్వాహకులు పోతూరి శేఖర్ (నూకలమర్రి, ప్రస్తుతం కరీంనగర్), రాతిపల్లి సంపత్ (మంచిర్యాల, ప్రస్తుతం కరీంనగర్) లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఇద్దరిని కరీంనగర్లో అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు.
“పూర్వాపరాలు తెలుసుకోకుండా వ్యక్తిగతంగా కించపరిచేలా కథనాలు రాసినా, సామాజిక మాధ్యమాల్లో పవిత్ర వృత్తి ముసుగులో అసత్య ప్రచారాలు చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు.” అని ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ అన్నారు.
