J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలోని గాంధీ చౌక వద్ద బుధవారం ఎమ్మార్పీఎస్ మరియు ఎంఎంఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి.
భూమి బిడ్డలం… ఆది జాంబవంతుని వంశీయులం మరియు అరుంధతి వశిష్టుల వారసులం.ఈ దేశ ధర్మ రక్షకులం.మన సంస్కృతి- మన బతుకమ్మ సంబరాలు సోదరీమణులు ఆడి పాడారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి రాజేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనపట్ల దినేష్, కౌన్సిల ముడుసుల ప్రశాంత్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సంగి శేఖర్ ,బిజెపి పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ పాల్గొని బతుకమ్మ యొక్క పండగ విశిష్టతను వివరించారు
కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పారేపల్లి రాజమల్లయ్య ,అరికిల్ల సతీష్ ,రాయిళ్ళ రవికుమార్, బొల్లరపు పోచయ్య, కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిల ముడుసుల ప్రశాంత్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చెందోలి శ్రీనివాస్ ,ఎంఎంఎస్ మండల అధ్యక్షురాలు జిల్లపేల్లి పద్మ ,ఎంఎంఎస్ పట్టణ అధ్యక్షురాలు ముత్తినేని రుక్మిణి వివిధ గ్రామాల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
