👉 హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వగ్రామం ధన్వాడ కు ఉదయం 10 గంటలకు !
👉 పగలు 2 గంటలకు మంథని పట్టణంలోని శివకిరణ్ గార్డెన్స్ లో స్వామీజీ ప్రవచనం !
J.SURENDER KUMAR,
ఆధ్యాత్మిక పరవచకులు, పరమ పూజ్య అవధూత దత్త పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదివారం భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వగ్రామం ధన్వాడ కు రానున్నారు.
హైదరాబాదు నుంచి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 10 గంటలకు స్వామీజీ ధన్వాడకు చేరుకుంటారు.
లోక కళ్యాణార్థం ఇక్కడి దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మహాపూర్ణాహుతి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు. అనంతరం భక్తులను దివ్య భాషణం ఇస్తారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా మంథనికి బయలుదేరి వెళ్తారు.
👉 మధ్యాహ్నం 2 గంటలకు మంథని పట్టణంలోని శివకిరణ్ గార్డెన్స్ లో..!

మంథని పట్టణంలోని శివకిరణ్ గార్డెన్స్ లో మధ్యాహ్నం 2 గంటలకు నియోజకవర్గం తో పాటు, వివిధ జిల్లాల నుంచి విచ్చేసే భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి పర్యటన మంథని ప్రాంత ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు, భక్తి మార్గంలో సమాజ సేవకు ప్రాధాన్యత ఇవ్వాలనే స్ఫూర్తిని అందించనుంది.
దైవానుగ్రహం కోసం ఆలయాలను సందర్శించే భక్తులు.. అదే దైవత్వాన్ని తోటి మనుషుల సేవలోనూ చూడగలిగితే సమాజంలో ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవత్వం మరింత వికసిస్తాయి. ఆధ్యాత్మికత మనసుకు ప్రశాంతతనిస్తే.. మానవ సేవ సమాజానికి సంతోషాన్నిస్తుంది. ఈ రెండింటి సమ్మేళనమే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి పర్యటనకు అసలైన స్ఫూర్తి.
