పేదల ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు మంత్రి అడ్లూరి!

  J SURENDER KUMAR,


పేద ప్రజల ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇళ్ల
సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు మంత్రి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి  లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….


అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

మాజీ ప్రధాని వర్ధంతి రోజున ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు ప్రొసీడింగులు అందించడం ఆనందంగా ఉందని, పేదలు ఆత్మగౌరవంతో కూడిన జీవనం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేష్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కాసారపు బాలగౌడ్, అధికారులు, సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

👉 పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి  లక్ష్మణ్ కుమార్ !

ఎండపెల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో సీసీఐ (CCI) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ……

రైతులు పండించిన పత్తికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.
రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పత్తి కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ, అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.