👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!
J.SURENDER KUMAR,
ప్రపంచంలో ఉక్కు మహిళగా ప్రత్యేక గుర్తింపు పొందిన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ పేద ప్రజల పెన్నిధిగా, బ్యాంకుల జాతీయకరణ, గరీబ్ హటావో నినాదంతో దేశంలో అనేక సంస్కరణలకు ఆమె శ్రీకారం చుట్టారు అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం ధర్మపురి మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని
ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…..
దేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేశారని అన్నారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడేందుకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని తెలిపారు.

ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనపట్ల దినేష్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బాలగౌడ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, పట్టణ అధ్యక్షులు రాజేష్, మరియు కౌన్సిలర్లు, సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
