₹ 14 కోట్ల పుష్కర పనులకు ప్రతిపాదనలు…!

👉 టైర్ – II శాశ్వత పనులకు..!


J.SURENDER KUMAR,


2027 సంవత్సరంలో జరగనున్న గోదావరి పుష్కరాల టైర్ – II శాశ్వత పనుల కోసం పంచాయతీరాజ్ శాఖ ₹14.25 కోట్ల రూపాయల పనులు చేపట్టడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వ కార్యదర్శి హనుమంతరావు ఈనెల 22న లేఖ సంఖ్య 582 ద్వారా. నిజాంబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో శాశ్వత పనులకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు.


జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ పరిధిలో గోదావరి తీరంలో గల మల్లాపూర్ మండలానికి ₹ 3 కోట్లు, ఇబ్రహీంపట్నం మండలానికి ₹ 2 కోట్లు నిధులతో పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు పంపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు ల కు కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.