చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి !

👉 సివిల్ జడ్జ్ మల్లాది అపర్ణ..!


  J.SURENDER KUMAR,


విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలలో ఉపాధ్యాయులు, నిర్వాహకులు , చట్టాలపై, ప్రత్యేకంగా లైంగిక వేధింపులు, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, పోకోస్ ఇలాంటి కఠినమైన చట్టాలపై అవగాహన కల్పించాలని సివిల్ జడ్జ్ సివిల్ జడ్జ్ మల్లాది అపర్ణ, విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి తన ప్రసంగంలో పేర్కొన్నారు.


మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలబాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం సురక్షిత్ బచ్చన్ అభియాన్ ఇంచార్జ్ గిట్ల భరత్ రెడ్డి  ఆధ్వర్యంలో కార్యక్రమంలో జడ్జి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బార్ వైస్ ప్రెసిడెంట్ కె రఘోత్తం రెడ్డి, శశిబుషన్ కాచే, గౌతమి శ్రీలక్ష్మి, వ్యాస్ కుమార్  పాఠశాల ఉపాధ్యాలు పాల్గొన్నారు.