తెలంగాణ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా మహారాష్ట్ర సీఎంకు ఆహ్వానం !

J SURENDER KUMAR,


హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ ని ఆహ్వానించారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి జరిగిన సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి  ఇన్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్ వివరాలను తెలియజేస్తూ పాల్గొనాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ని అహ్వానించారు. అందుకు ఫడ్నవీస్  సానుకూలంగా స్పందించారు. ఆ సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తి ఉందని, హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.