👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పట్టణంలోని కమలాపూర్ రోడ్డులో ఉన్న ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన చిల్డ్రన్ పార్క్, బస్తీ దవాఖానను తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి తో కలిసి ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

చిన్నారులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో గడిపేందుకు చిల్డ్రన్ పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా, బస్తీ దవాఖాన ద్వారా స్థానిక ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.

ప్రజల అవసరాలను గుర్తించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు 7వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.
