👉 పుష్కర పనులకు ₹226.41 కోట్ల బడ్జెట్ మంజూరు !
👉 జగిత్యాల కలెక్టర్ బి సత్య ప్రసాద్ !
J. SURENDER KUMAR
గురువారం జగిత్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ప్రసునాంబలతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
👉 సమీక్ష సమావేశంలో ప్రభుత్వం మంజూరు చేసిన బడ్జెట్ వివరాలను, భక్తుల రాకాంచను కలెక్టర్ మంత్రికి వివరించారు.
👉 జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ,…..
2015 గోదావరి పుష్కరాల సమయంలో సుమారు 1.50 కోట్ల మంది భక్తులు వచ్చారని, 2027 పుష్కరాలకు సుమారు 2.40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఒక్క ధర్మపురి ప్రాంతానికే సుమారు కోటి మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ అంచనాల ఆధారంగా మండలాలు, ఘాట్ల వారీగా భక్తుల రాకపోకలను విశ్లేషించి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు రూపొందించినట్లు వివరించారు.
👉 ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో కోటి మంది, ధర్మపురి మండలంలో 60 లక్షల మంది, వెల్గటూర్లో 40 లక్షల మంది, ఇబ్రహీంపట్నంలో 23 లక్షల మంది, మల్లాపూర్లో 15 లక్షల మంది, రాయికల్లో 5 లక్షల మంది, బీర్పూర్లో 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు.
👉 ధర్మపురి ప్రాంతంలో హనుమాన్ గడ్డ ఘాట్, పాత వీఐపీ ఘాట్, మంగలి ఘాట్, హరిత ఘాట్, మహాలక్ష్మి ఘాట్ తదితర ఘాట్లతో పాటు వెల్గటూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, బీర్పూర్, రాయికల్ మండలాల్లోని వివిధ గ్రామాల వద్ద ఘాట్ల అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు.

👉 గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు సంబంధించి మొత్తం ₹226.41 కోట్ల బడ్జెట్ మంజూరైందని కలెక్టర్ తెలిపారు. ఇందులో టైర్-1 పనులకు ₹206.42 కోట్లు, టైర్-2, టైర్-3 పనులకు ₹.19.99 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, నీటిపారుదల, దేవదాయ, ప్రజారోగ్యం, విద్యుత్, మున్సిపల్, పర్యాటక, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వైద్య శాఖకు సంబంధించిన అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు ఇంకా విడుదల కావాల్సి ఉందని పేర్కొన్నారు.
👉 ధర్మపురిలో ప్రస్తుతం ఉన్న ఘాట్ను 270 మీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు ₹22.16 కోట్లతో పనులు చేపట్టగా, టెండర్లు ఖరారై పనులు ప్రారంభమైనట్లు కలెక్టర్ తెలిపారు. ధర్మపురిలో కొత్తగా 30 మీటర్ల ఘాట్ నిర్మాణానికి ₹.6 కోట్లు, కోటిలింగాలలో 210 మీటర్ల ఘాట్ అభివృద్ధికి ₹16.13 కోట్లు కేటాయించినట్లు వివరించారు. రాయపట్నం, తిమ్మాపూర్, రాజారం, ఎర్దండి, కొమటి కొండాపూర్, బర్తిపూర్, వేములకూర్తి, రత్నలమడుగు, ఫకీర్ కొండాపూర్, వల్గొండ తదితర ప్రాంతాల్లో కొత్త ఘాట్ల నిర్మాణం, నిర్వహణ పనులకు ₹11.99 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
👉 ధర్మపురి వీఐపీ ఘాట్ రహదారి నిర్మాణం, రెండు వంతెనలు, హెలిపాడ్ ఏర్పాటుకు సంబంధించిన పనులు, నంది విగ్రహం నుంచి ధర్మపురి ఆలయం వరకు సీసీ రోడ్డు విస్తరణ, కోటిలింగాల ఆలయానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణం తదితర పనుల వివరాలను కలెక్టర్ వెల్లడించారు. కమలాపూర్, తిమ్మాపూర్, అక్షయపల్లి రహదారులు, వివిధ బైపాస్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు కూడా చేపడుతున్నట్లు తెలిపారు.
👉 ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో ₹15 కోట్లతో 46 అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు మంజూరయ్యాయని, వీటిలో 33 పనులకు ఎల్ఓఏ జారీ చేసినట్లు కలెక్టర్ వివరించారు. మిగిలిన పనులకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ధర్మపురి, వెల్గటూర్ ప్రాంతాల్లోని ఘాట్లు, పార్కింగ్ స్థలాలు, రహదారుల వద్ద లైటింగ్ ఏర్పాట్లకు రూ.6 కోట్లు కేటాయించగా, ₹5.46 కోట్లకు పైగా అంచనాలతో పనులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.
👉 పుష్కరాల సందర్భంగా 12 రోజుల పాటు అవుట్డోర్ ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు, ధర్మపురి హరిత హోటల్ మరమ్మతులు, పునరుద్ధరణ పనులను చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఘాట్లు, భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అవసరమైన పనులు చేపడుతున్నట్లు వివరించారు.
👉 రోడ్ల విస్తరణ, ఘాట్ల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ వివరాలను కలెక్టర్ సమీక్షించారు. ధర్మపురి మహాలక్ష్మి ఘాట్, రహదారుల విస్తరణకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పరిహారం చెల్లింపులను మూడు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భూమి అందుబాటులోకి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించారు.
👉 ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణకు ₹10 కోట్లు, కోటిలింగాల ఆలయ పునరుద్ధరణకు ₹.10 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. ధర్మపురి ఆలయ అభివృద్ధికి భూసేకరణ కోసం ₹20 కోట్లు జమ చేయగా, పరిహారం చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.
👉పుష్కరాల సమయంలో వైద్య శిబిరాలు, అత్యవసర వైద్య సేవల కోసం ₹.2.77 కోట్ల అదనపు నిధులు, శాంతిభద్రతల నిర్వహణ కోసం పోలీసు శాఖకు ₹ 5.21 కోట్ల అదనపు నిధుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు.
👉 పుష్కరాల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రహదారులు, ఘాట్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత, వైద్య సేవలకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
👉 గోదావరి నదిలో మురుగునీరు కల్వకుండ అవసరమైన ఎస్టిపిల నిర్మాణం లేదా మురుగునీటి డైవర్షన్ సంబంధిత పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా చూడాలని అన్నారు.
ముఖ్యమంత్రి మంత్రులు ఇతర నాయకులు ప్రముఖులు గోదావరి పుష్కర స్నానాలకు ధర్మపురి వచ్చినట్లయితే వారికి ప్రత్యేకంగా వీఐపీ రోడ్డు ఏర్పాటు కోసం హైదరాబాద్ స్థాయిలో ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ మంత్రికి విజ్ఞప్తి చేశారు
👉 వీఐపీ రోడ్డు, ధర్మపురి ఆలయ మాడవీధుల అభివృద్ధి కోసం అవసరమైన భూసేకరణ చేసేందుకు అట్టనే మినహాయింపు కోసం ప్రతిపాదనలు సమర్పించామని ఇవి తొందరగా వస్తే పనులు వేగవంతంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
మాడ వీధుల అభివృద్ధికి అవసరం భూసేకరణ కోసం 24 కోట్లు, పంచాయతీరాజు రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు ₹8 కోట్లు, విఐపి రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరాన్ని మిత్తం ₹8 కోట్లు అవసరం ఉంటాయని ఈ నిధులు వీలైనంత త్వరగా జిల్లాకు చేరేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.
👉 గోదావరి పుష్కరాల సమయంలో అవసరమైన మేర పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, పోలీస్ శాఖ అధికారులతో సమయాన్ని చేసుకుంటూ ఎక్కడ పార్విన్ ఏర్పాట్లు ఎంత మేరకు చేయాలో తుది ప్లాన్ ను 10 రోజులలో అందిస్తామని అన్నారు.
