👉 గ్రామ సమస్యల పరిష్కారానికి..!
J.SURENDER KUMAR,
పెగడపల్లి మండలం బతికపెల్లి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం గ్రామ ప్రజలతో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గ్రామ ప్రజల నుంచి వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పలుకుల సంఘాల భవనాల నిర్మాణం, అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులు, తాగునీటి సమస్య తదితర అంశాలను గ్రామ ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
👉 స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి త్వరలోనే బోర్లు వేయించి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పలుకుల సంఘాల భవనాల నిర్మాణంతో పాటు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
బతికపెల్లి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు దశలవారీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఇందిరమ్మ ఇండ్లు గానీ చేయూత పింఛన్లు గానీ గ్రామ ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
