గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది !


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!


J.SURENDER KUMAR,

గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని  రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీశ్రీ సంతు సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత దేవాలయ నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ…...

గిరిజనుల అభ్యున్నతికి, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని పేర్కొన్నారు. గిరిజన సమాజం అభివృద్ధికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

👉 శ్రీశ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ సమాజానికి అందించిన సేవలు, బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో ఐక్యత, సోదరభావం, సేవాభావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. దేవాలయాల నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక విలువలు, మన సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందుతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, బంజారా సమాజ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.