దోమలకుంటలో 20 లక్షలతో రోడ్ల కు శంకుస్థాపన!

👉 లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం ₹ 20 లక్షల నిధులతో చేపట్టనున్న నూతన అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తూ రోడ్లు, తాగునీరు తదితర సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.

అర్హులైన పేదలకు ఇళ్లను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతూ, గ్రామాల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.