బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ తో సమావేశం!

J.SURENDER KUMAR,

తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ తో ధర్మపురి బ్రాహ్మణ సాంగ్ సభ్యులు, అధ్యక్షుడు, గుండి శంకర్ శర్మ, తదితరులు బుధవారం హైదరాబాదులో సమావేశమయ్యారు.

ధర్మపురి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన గుండిశంకర్ శర్మ, కార్పొరేషన్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ లో  ఉద్యోగ రీత్యా ఉంటున్న రిటైర్డ్ ఐసిఐసిఐ బ్యాంకు సౌత్ ఇండియా రీజినల్ మేనేజర్ గుండి విష్ణు ప్రసాద్, తెలుగు కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంఘనపట్ల నరసయ్య, జీ న్యూస్ సౌత్ ఇండియా సీఈవో సంగనభట్ల భరత్ కుమార్, బిజెపి అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ ,  రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు జనగామ నాగరాజు, వేద పండితుడు మధు శంకర్ శర్మ, ఉపాధ్యాయ సంఘం నాయకుడు కాసర్ల వెంకటరమణ, మహేష్ ,సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కంటూ,  మణికంఠ, వినయ్, తదితర యువకులు చైర్మన్ తో సమావేశంలో పాల్గొన్నవారు.

సంఘం బలోపేతం, బ్రాహ్మణ యువతకు ఉన్నత  విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు,  బ్రాహ్మణ సంఘ భవనం ఆధునీకరణ, తదితర అంశాలపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు. మరోసారి జరగనున్న సమావేశంలో కార్యాచరణ ప్రణాళికకు రంగం సిద్ధం చేయాలని చర్చించారు.