👉 ధర్మపురిలో 3,500 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు !
👉 ఆడబిడ్డల పెళ్లిళ్లకు మరో ₹ 45 లక్షల ఆర్థిక సాయం.!
👉 సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేసేది లేదు !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR ,
పేదవాడికి సొంతిల్లు ఒక కల.. ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు ఒక బాధ్యత. ఈ రెండు సందర్భాల్లోనూ ఆర్థిక భరోసా కల్పిస్తూ పేద కుటుంబాలకు అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటివరకు 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి ₹ 5 లక్షల చొప్పున మొత్తం ₹175 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నామని వెల్లడించారు.
ధర్మపురి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు ₹ 45 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

పేదల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
👉 ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక అండ !

పేదింటి ఆడబిడ్డల వివాహాలు తల్లిదండ్రులకు భారంగా మారకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తోందని మంత్రి తెలిపారు.
పేదింటి ఆడబిడ్డల వివాహాలు తల్లిదండ్రులకు భారంగా మారకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తోందని మంత్రి తెలిపారు.
👉 సంక్షేమ పథకాలు నిరంతరాయంగా అమలు !

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయడం లేదని మంత్రి అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం నిలిచిపోతుందంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, ప్రభుత్వం ఈ పథకాన్ని ఎక్కడా నిలిపివేయలేదని స్పష్టం చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి రాజేష్, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనబట్ల దినేష్, అధికారులు, మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, చిలుముల లక్ష్మణ్, చిపిరిశెట్టి రాజేష్, కౌన్సిలర్లు వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
