J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణానికి నూతనంగా మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ స్థలం కోసం స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ……
నియోజకవర్గం లోని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ధర్మపురి మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించినట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పరిశీలించినట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్మాణ పనులకు అవసరమైన తదుపరి చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించడంతో పాటు, విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
మంత్రి వెంట సంబంధిత శాఖల అధికారులు, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి రాజేష్, జగిత్యాల జిల్లా గ్రంధాలయ చైర్మన్ సంఘనమట్ల దినేష్ ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుము లక్ష్మణ్, మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
