బీఆర్ఎస్ అధికారం లో ఒక పెన్షన్ ఇవ్వలేదు..!

👉 ధర్మపురిలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ !

👉 సంక్రాంతి తర్వాత శరవేగంగా అభివృద్ధి పనులు..!

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్..!


J.SURENDER KUMAR,

సంక్రాంతి పండగ నుంచి  ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా నిర్వహిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ధర్మపురి ఎంపీడీవో కార్యాల యంలో నూతనంగా మంజూరు ఆయన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,..

గత బీఆర్ ఎస్ ప్రభుత్వం కాలంలో పదేళ్ల పాటు అధికారంలో ఉండి అర్హులైన ఒకరికి పింఛన్లు మంజూరి చేయలేదని అన్నారు. ప్రజలతో ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో చేయూత పింఛన్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ధర్మపురి మండలానికి కొత్తగా 743 చేయూత పింఛన్లు మంజూరి అయినట్లు మంత్రి తెలిపారు.

👉 ధర్మపురి మండలంలో 1,312 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేస్తున్నమని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా 660 మందికి ఇందిరమ్మ ఇళ్లను ధర్మపురి మండలంలో మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. వచ్చే సంక్రాంతి నుండి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతామని లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్ తో పాటు మండలంలోని పలువురు సర్పంచులు, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.