సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి అడ్లూరి మాదిగ ఎంప్లాయీస్!

👉 వర్గీకరణ అమలుపై సర్కారు స్పష్టత సామాజిక న్యాయానికి ప్రభుత్వం ప్రాధాన్యం !


J.SURENDER KUMAR,


ఎస్సీ వర్గీకరణ అమలులో ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా మాదిగ ఉద్యోగులకు ప్రమోషన్లు, నియామకాలు తదితర అంశాల్లో నిబంధనల ప్రకారం న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం, ప్రభుత్వ నిర్ణయంతో  మాదిగ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు మార్గం సుగమం కావడంపై మాదిగ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వారు కృతజ్ఞతలు తెలిపారు.

👉 మంత్రి అడ్లూరి నేతృత్వంలో…..

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని శనివారం జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  నేతృత్వంలో మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ,ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి. కాశీం , చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లేశం తో పాటు పలువురు ప్రతినిధులు కలిసిన వారిలో ఉన్నారు.


ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని ఉద్యోగుల పదోన్నతుల్లో అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు ఈ సందర్భంగా  వారు ముఖ్యమంత్రి  కృతజ్ఞతలు తెలిపారు.