👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
తెలంగాణలోని రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE)లో భాగంగా కొడంగల్‌ను ‘ఇండస్ట్రియల్ హబ్’గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రదర్శనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
👉 పారిశ్రామిక ప్రగతికి కొడంగల్ ప్రాంతంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారు.
👉 ఈ హబ్‌కు సంబంధించి హకీంపేటలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభోత్సవంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు దామోదర రాజనర్సింహ , తుమ్మల నాగేశ్వర రావు , దుద్దిళ్ల శ్రీధర్ బాబు , వాకిటి శ్రీహరి , ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
👉 పరిశ్రమలు హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి, స్థానిక యువతకు తమ ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కొడంగల్ ఇండస్ట్రియల్ హబ్ ను 943.34 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలను ఆకర్షించేలా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నారు.

👉 హబ్‌కు అవసరమైన భూసేకరణకు ₹ 220 కోట్లు వ్యయం కాగా, రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ₹ 441.91 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ హబ్ పరిధిలో ఇప్పటికే రెండు పారిశ్రమలకు భూమి కేటాయించారు.
👉 బిర్లాను (Birlanu) లిమిటెడ్ సంస్థకు సంబంధించిన ఫైబర్ సిమెంట్ బోర్డుల తయారీ పరిశ్రమ, ఎకోపామ్ (EcoPalm) ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన వెజిటబుల్ ఆయిల్స్, వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం మొత్తం 96 ఎకరాల భూమిని కేటాయించారు.

👉 ఈ రెండు సంస్థలు దాదాపు ₹ 252.86 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించగా, వీటి ద్వారా దాదాపు 535 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
