👉 కౌన్సిల్ సభ్యులకు తెలియకుండా డబ్బులు డ్రా !
👉 కమిషనర్ అంశంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన చైర్ పర్సన్ !
👉 స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విచారణ నివేదికలో..?
👉 మేనేజర్ కు ఇంచార్జ్ కమిషనర్ గా బాధ్యతలు !
J . SURENDER KUMAR,
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణ మున్సిపల్ కమిషనర్ గత కొన్ని రోజులుగా సెలవు లో కొనసాగుతున్నారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై జగిత్యాల జిల్లా కలెక్టర్ కమిషనర్ సస్పెండ్ చేశారా ? ప్రభుత్వానికి సరెండర్ చేశారా ? అనే అంశంలో స్పష్టత లేదు. ప్రభుత్వం గత రెండు రోజుల క్రితం స్థానిక మున్సిపల్ కార్యాలయ మేనేజర్ కు ఇన్చార్జి కమిషనర్ గా తాత్కాలిక బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారి చేసినట్టు తెలిసింది.
నిధుల దుర్వినియోగంపై స్థానిక చైర్ పర్సన్ ఫిర్యాదు మేరకు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్, గత నెల రోజుల క్రితం విచారణ చేపట్టి నివేదికను ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. నిధులు దుర్వినియోగం అంశంపై గత కొన్ని రోజుల క్రితం మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, హుటాహుటిన కమిషనర్ పై చర్యలకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టారా ? సెలవు పై పంపించారా ? అనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది.
👉 విశ్వసనీయ అనధికార వర్గాల సమాచారం మేరకు…
స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ బాలాగౌడ్, మున్సిపల్ కమిషనర్ పై జరిపిన విచారణ నివేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం(CPO) 2026 మార్చి మాసంలో దాదాపు ₹ 3 లక్షల రూపాయల నిధులు కేటాయించిందని పేర్కొన్నట్టు తెలిసింది.
👉 పట్టణంలోని 15 వార్డులలో సభలో నిర్వహించాల్సిండగా కమిషనర్ ఓకే రోజున వార్డు సభ నిర్వహించినట్టు సమాచారం.
👉 ఒక్కొక్క వార్డు సభలకు టెంటు, కుర్చీలు, మైక్ సెట్, తాగునీరు, ఫ్లెక్సీలు, బ్యానర్ల కోసం దాదాపు ₹ 20, వేల చొప్పున మొత్తం ₹ 3 లక్షల రూపాయలు ప్రభుత్వం మున్సిపాలిటీకి కేటాయించినట్టు పేర్కొన్నారు.
👉 కౌన్సిలర్లకు, చైర్ పర్సన్ కు ఏలాంటి సమాచారం ఇవ్వకుండా, కమిషనర్, కార్యాలయ అకౌంటెంట్ పై ఒత్తిడి తెచ్చి టెంట్ హౌస్ యజ మాని పేరిట 2026 మే మాసంలో ***559 చెక్కు జారీ చేయించినట్టు సమాచారం.
👉 కౌన్సిల్ సభ్యులకు ఎలాంటి సమాచారం, కౌన్సిల్ సమావేశంలో ఆమోదం లేకుండా, ఆయా వార్డు లలో సభలు నిర్వహించకుండా కమిషనర్ టెంట్ హౌస్ యజమాని ( బినామీ ) పేరిట చెక్ జారీ చేసిన అంశంపై చైర్ పర్సన్ కలెక్టర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
దీనికి తోడు కమిషనర్ వెహికల్ అలవెన్స్ పేరిట ప్రతి నెల దాదాపు ₹ 30 వేలు డ్రా కోసం చేసిన ప్రయత్నాలు విఫలమైనట్టు సమాచారం. మున్సిపల్ పాలకవర్గం లేని సమయంలో స్పెషల్ అధికారి పాలలోనే అధికారికి వెహికిల్ అలవెన్స్ పొందడానికి అర్హత అనే నిబంధన ఉంది. కార్యాలయ సిబ్బందిపై అలవెన్స్ బిల్లుల కోసం ఒత్తిడి చేయడంతో వారు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది .
జిల్లా యంత్రాంగం మున్సిపల్ నిధులను రికవరీ చేస్తారా ? కమిషనర్ పై చర్యలు తీసుకుంటారా ? ప్రభుత్వానికి సరెండర్ చేస్తారా ? సస్పెండ్ చేస్తారా ? అనేది వేచి చూడాల్సిందే.
